తాజా వార్తలు

Monday, 23 May 2016

8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తె సందర్భం గా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు ప్రసాదం జూన్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ చేయనున్నట్లు బత్తిన సోదరులు హరినాధ్‌గౌడ్, సంతోష్‌గౌడ్, శివానందగౌడ్, గౌరీశంకర్‌గౌడ్ వెల్లడించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... జూన్ 8వ తేదీ ఉదయం 8:30 నుంచి ప్రసాదం పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పొందలేనివారు మూడు రోజుల పాటు దూద్‌బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చన్నారు. ప్రసాదం తీసుకోవడానికి 3 గంటల ముందు, తీసుకున్న గంట పాటు ఆహారం తీసుకోరాదన్నారు.
 
« PREV
NEXT »

No comments

Post a Comment