తాజా వార్తలు

Monday, 16 May 2016

టాప్ లో మోదీ…

సోషల్ మీడియా వెబ్‌సైట్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ హవా రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో.., సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలకు సేవలు అందించడంలో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. సోషల్‌ మీడియా సేవీ మినిస్టర్స్‌ పేరుతో ఈటీ మ్యాగజైన్‌, కాలిఫోర్నియాకి చెందిన సోషల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ఫ్రొలే సంయుక్తంగా ఓ సర్వేని చేపట్టాయి. ఈ సర్వేలో టాప్‌ 10 జాబితాలో ఉన్న కేంద్రమంత్రుల వివరాలను ప్రకటించింది. ఇందులో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ రెండో స్థానంలో నిలిచారు.
ఆమెతో పాటు రెండో ర్యాంకులో కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఉన్నారు. సోషల్‌ మీడియా ద్వారా వారు వ్యవహరించే తీరును పరిగణలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించారు. ఏదైనా చర్యపై సానుకూలంగా, ప్రతికూలంగా, తటస్థంగా ఉండటాన్ని విశ్లేషించారు. ఇందులో మోడీ 78శాతం సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌జైట్లీ, సురేశ్‌ ప్రభు, రవిశంకర్‌ ప్రసాద్‌, హర్షవర్థన్‌, నిర్మలా సీతారామన్‌లు వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment