Writen by
vaartha visheshalu
23:53
-
0
Comments
మిషన్ కాకతీయకు దేశమంతా ప్రశంసలు వస్తున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతి ఎత్తైన 45 అడుగుల మిషన్ కాకతీయ పైలాన్‌ను వరంగల్ జిల్లా మాదన్నపేట చెరువుకట్టపై మంత్రులు హరీష్‌రావు, చందూలాల్ ఆవిష్కరించారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి గురించి అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. స్వయంగా ప్రధాని మోడీ అభినందించారని తెలిపారు. నర్సంపేట రంగయ్య చెరువును గోదావరి జలాలతో నింపి 25 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పాకాల తూములను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడం కోసం సీఎం కేసీఆర్ రూ. 25 వేల కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
దేవాదుల ద్వారా పాకాల చెరువును నింపుతామని చెప్పారు. పాకాల నుంచి రెండో పంటకు నీరందిస్తామని పేర్కొన్నారు. పాకాల తూములకు మరమ్మతులు చేసి, పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. మున్నేరులో 12 చెక్ డ్యామ్‌లను నిర్మిస్తామని చెప్పారు.
No comments
Post a Comment