తాజా వార్తలు

Friday, 6 May 2016

కష్టపడుతున్న అదాశర్మ…

ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే అదా శర్మ ఇప్పుడు తెగ కష్టపడిపోతుందట. బాలీవుడ్ లో నటించబోయే ‘కమాండ్ 2’ సినిమా కోసం ఈ అమ్మడు వర్కౌట్లు చేస్తుందట. విద్యుత్ జమ్వాల్ లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో అదా శర్మ హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో హీరోతో పాటు హీరోయిన్ కూడా యాక్షన్ సన్నివేశాలు చేయాలంట. అందుకోసమే అదా జిమ్ లో కసరత్తులు చేస్తుందట.
దీనిపై స్పందించిన అదా తన కెరీర్ లో ఇదే చాలా క్లిష్టమైన పాత్ర అని, అందుకోసం బాగా శ్రమిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించే ‘జగ్గా జాసూస్’ సినిమాలో కూడా ఒక పాత్రను పోషించనుంది అదా. మరి ఇక్కడ అడపాదడపా ఛాన్స్ లను కొట్టేసిన ఈ హీరోయిన్ బాలీవుడ్ లో నైనా వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటుందేమో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment