తాజా వార్తలు

Saturday, 28 May 2016

నేల మీద... గాల్లో తేలుతూ..!


మంచి పాత్ర దొరకాలే కానీ, దానికోసం ఎంతైనా కష్టపడతానంటున్నారు అదా శర్మ. ‘హార్ట్ ఎటాక్’ నుంచి మొన్నటి ‘క్షణం’ వరకూ గ్లామరస్ పాత్రలు ఎక్కువగా చేసిన అదా ఇప్పుడు తనలో మరో కోణాన్ని చూపించనున్నారు. హిందీ చిత్రం ‘కమాండో 2’లో పవర్‌ఫుల్ అదాని చూడబోతున్నాం. ఈ చిత్రంలో ఈ బ్యూటీ డ్యూయెట్లు పాడతారో లేదో కానీ, ఫైట్లు మాత్రం చేస్తారు. అది కూడా రిస్కీ ఫైట్స్ అన్న మాట. అందుకే కసరత్తులు చేస్తున్నారు. ఈ పాత్ర కోసం జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నారు.

ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఫొటోలు కూడా దిగారు. నేల మీద మాత్రమే కాదు.. గాల్లో కూడా అదా రిస్కులు చేసేస్తున్నారు. దీన్నిబట్టి ‘కమాండో 2’లో అదా అదరిపోయే ఫైట్స్ చేస్తారని ఊహించవచ్చు.  ఈ చిత్రంతో పాటు హిందీలో ‘జగ్గా జాసూస్’లో కూడా అదా నటిస్తున్నారు. ‘‘నా మటుకు నేను ఏ పాత్రకైనా న్యాయం చేయాలనుకుంటా. అది గ్లామరస్ అయినా.. పవర్‌ఫుల్ అయినా. ఒకే రకం పాత్రలకే పరిమితం కాను. అలాగే నాకు భాష గురించి కూడా పట్టింపు లేదు. ఎక్కడ మంచి అవకాశాలొస్తే అక్కడ చేస్తా’’ అని అదా శర్మ పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment