తాజా వార్తలు

Friday, 27 May 2016

లిఫ్ట్‌లో చిక్కుకున్న అల్లు అర్జున్‌…

సినీ హీరో అల్లు అర్జున్‌కు ప్రమాదం తప్పింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన హీరో అల్లుఅర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. స్వామి దర్శనం అనంతరం దేవస్ధానం నుంచి వచ్చేటప్పుడు వారు ఎక్కిన లిఫ్ట్ అధిక బరువుతో పూర్తిగా కిందకు దిగిపోయింది.
దీంతో వారు లిఫ్ట్‌ నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్‌లో సాంకేతిక లోపం తెలెత్తింది. వెంటనే ఆలయ సిబ్బందితో లిఫ్ట్ డోర్‌ను తొలగించి అందులో ఉన్నవారిని బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment