తాజా వార్తలు

Wednesday, 18 May 2016

అమెరికన్ ఓటర్లలో చీలిక…

అమెరికన్లలో ఓటర్లలో చీలిక ఏర్పడుతుందట. తమ అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో .., తెల్లవాళ్లు డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ఉండగా, నల్లజాతి వారు, వలస వచ్చిన వారు హిల్లరీ క్లింటన్ కు మద్దతిస్తున్నట్టు అమెరికాలోని ఓ సర్వే తెలిపింది.
అంతేకాకుండా గతంతో పోలిస్తే హిల్లరీకి వస్తున్న మద్దతు 48 శాతం నుంచి 45 శాతానికి తగ్గిందని, కానీ వలస వచ్చినవారు మాత్రం హిల్లరీకి 75 శాతం మంది మద్దతు పలుకుతున్నారని పేర్కొంది. ఇక తెల్లవారిలో హిల్లరీకన్నా ట్రంప్ కు 14 శాతం మంది అధికులు మద్దతిస్తున్నారంట. స్వతంత్ర ఓటర్లలో 44 శాతం మంది ట్రంప్ కు, 36 శాతం మంది హిల్లరీకి ఓటేసేట్టున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఆన్ లైన్లో ఈ సర్వేను నిర్వహించామని, 12,507 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఇందులో పాల్గొన్నట్లు పేర్కొంది.
« PREV
NEXT »

No comments

Post a Comment