తాజా వార్తలు

Thursday, 26 May 2016

మే 29 న ఎస్వీయూ బాసెట్


దూర విద్య ద్వారా ఓపెన్ యూనివర్సిటీ విధానంలో డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ఎస్వీయూ బాసెట్-2016 ను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఎస్వీయూ దూర విద్యావిభాగం డెరైక్టర్ ప్రొపెసర్ ఎంపి నరసింహరాజు తెలిపారు. ఎలాంటి విద్యార్హతలేని వారు ఈ ప్రవేశపరీక్ష రాయవచ్చు. తిరుపతిలోని ఎస్వీయూ కాలేజ్ ఆప్ ఆర్ట్స్‌లో జరిగే ఈ ప్రవేశపరీక్షకు సుమారు 1000 మంది దరఖాస్తు చేశారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వారందరికి తిరుపతిలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు కూడా 3 పోటోలు, గుర్తింపు కార్డుతో నేరుగా వచ్చి 300 రూపాయల పరీక్ష పీజు చెల్లించి ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చన్నారు.

పీజీ దరఖాస్తు గడువు పుంపు
ఎస్వీయూనివర్సిటీలో దూరవిద్య విభాగంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ దరఖాస్తు గడువును జూన్ 10 వతేదీ వరకు పొడిగించామన్నారు. అసక్తి కల్గిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు దగ్గరలోని ఎస్వీయూ దూరవిద్య కేంద్రం అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment