తాజా వార్తలు

Saturday, 7 May 2016

ఎదురు చూపులు ఎన్నాళ్లు?

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతోంది. అయితే ఇప్పటి వరకు తిరుమల తిరుపతిదేవస్థానం పరిధిలో ఒక్కపోస్టును కూడా భర్తీ చేయలేదు. ధార్మిక సంస్థ ఉద్యోగాలపై రెండుతెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు కొండంత ఆశను పెట్టుకుని కష్టాల జీవనం సాగిస్తున్నారు. అయితే  టీటీడీ ఉన్నతాధికారుల అలసత్వం, పాలకమండలి నిర్లక్ష్యం కారణంగా ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు.
 
 తిరుపతి అర్బన్:  ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమానం గా అన్ని శాఖ ల  విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటిలోనూ సుమారు పదేళ్లుగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుత ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగి మానసిక, శా రీరక క్షోభను ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని టీటీడీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆయా విభాగాల్లోని ఖాళీల ఆధారం గా నియామకాలు చేపట్టాలని సంవత్సరాల తరబడి డిమాండ్ చేస్తూ, ఆందోళనలు చేపడుతు న్నా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

అందుకు తోడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ఊకదంపుడు ప్రకటనలు చేయించారు. అందులో భాగంగానే ఆయ న సొంత జిల్లా పరిధిలోని టీటీడీ ధార్మిక సంస్థలో వేలాది ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తానని అనేక బహిరంగ సభల్లో ప్రకటించారు. తీరా అధికార కుర్చీలోకి వచ్చి 24 మాసాలు గడిచిపోతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా టీటీడీ అధికార యంత్రాంగం భారీ కసరత్తు చేపట్టి పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలను 2014 డిసెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపినా ఇదివరకు ఆ ప్రతిపాదనలకు మోక్షం కల్పించలేదు.

 టీటీడీ ప్రతిపాదించింది2800 ఉద్యోగాలకే..
 టీటీడీ అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన అంశాలను బట్టి నోటిఫై చేసిన ఉద్యోగ ఖాళీల సంఖ్య కేవలం 2800 మాత్రమే. అయితే టీటీడీలోని వివిధ ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు గణాంకాలతో సహా ప్రకటిస్తు న్న ఉద్యోగ ఖాళీల సంఖ్య మాత్రం సుమారు 5వేల పైచిలుకే. కానీ అధికారులు ప్రతిపాదించిన సంఖ్యతోనైనా నోటిఫికేషన్ వచ్చి తమకు ఉద్యోగాలు దక్కితే చాలంటూ నిరుద్యోగ యువత కొండంత ఆశతో ఎదురు చూస్తోంది. అధికారు లు పంపిన నివేదికల మేరకు భర్తీ చేయనున్న వివిధ విభాగాల ఉద్యోగాల వివరాలిలా ఉన్నా యి. పరిపాలనా విభాగంలో-1300 ఉద్యోగాలు, ఇంజినీరింగ్‌లో(ఎలక్ట్రికకల్, వాటర్ వర్క్స్, సివిల్ కలిపి)-130, విజిలెన్స్ విభాగంలో-50, మెడికల్ విభాగంలో-56, ప్రెస్ విభాగంతో పాటు గార్డెనింగ్ విభాగంలో-210 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు.

అయితే అధికారులు ప్రతిపాదనల్లో చూపిన ఉద్యోగాల సంఖ్య,  ఖాళీల సంఖ్యలో కేవలం 50 శాతం కూడా లేదని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. అంతేగాక టీటీడీలోని టెక్నికల్(కంప్యూటర్ సెల్, డేటా ఎంట్రీ, కాల్‌సెంటర్) ఫైనాన్స్ అండ్ ఆడిటింగ్, కల్యాణకట్ట, మార్కెటింగ్, ఫైర్ విభాల్లోని ఖాళీలను ఏమాత్రం ప్రతిపాదనల్లో అధికారులు ప్రస్తావించకపోవడం దారుణమని మరోవైపు టీటీడీ ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా పాలకమండలి చొరవ తీసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు ఆరంభించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లేకుంటే ఉద్యమాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment