తాజా వార్తలు

Thursday, 19 May 2016

నేనేం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు…

అందంగా కనిపించడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ వచ్చిన వార్తలను ఖండించింది బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ. తాను కూడా అందరిలాంటి మనిషినేనని, అందరిలాగే తనలో కూడా లోపాలున్నాయని.., కానీ ఇంతవరకు ఎప్పుడూ పాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదని, ముఖ్యంగా పెదవులకు ప్రత్యేకంగా ఎటువంటి సర్జరీలు చేయించలేదని చెప్పింది.
‘బాంబే వెల్వేట్’ సినిమా కోసం అనుష్క సర్జరీ చేయించుకుందంటు వచ్చిన వార్తల నేపధ్యంలో ఆమె స్పందించారు. అయితే ఈ సినిమా మేకప్ విషయంలో మాత్రం మెలుకువలు నేర్చుకున్నానని తెలిపింది.ఈ విషయం తెలుసుకోకుండా కొంతమంది ఇలాంటి రూమర్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా అనుష్క, సల్మాన్ ఖాన్ జంటగా నటించిన ‘సుల్తాన్’ సినిమా ఈ రంజాన్ కు విడుదలవనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment