తాజా వార్తలు

Monday, 23 May 2016

అమరావతిని రెండో టోక్యోగా భావించండి…

జపాన్ కంపెనీలు అమరావతిని తమ రెండో రాజధానిగా భావించాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో జపాన్ కంపెనీలతో సదస్సు నిర్వహించారు. సుమారు 78 సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ, అమరావతిలో ఉన్న వనరుల గురించి వారికి వివరించారు సీఎం.
జపాన్‌ సంస్థ మాకీ అసోసియేట్స్… అమరావతి అర్కిటెక్ట్ అనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన జెట్రో సంస్థ… తాము ఏపీలో పెట్టబోయే పెట్టుబడులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
« PREV
NEXT »

No comments

Post a Comment