తాజా వార్తలు

Saturday, 21 May 2016

మరికొద్ది సేపట్లో ఏపీ మెడికల్ ఫలితాలు…

ఈ రోజు ఉదయం 11గంటలకు ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ.., ఒక సంవత్సరం నీట్ ను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని వ్యాఖ్యానించారు. నీట్ పై ఆర్డినెన్స్ తేవాలని కేంద్రాన్ని మొదట కోరింది చంద్రబాబేనని, ఆ తరువాత కేంద్రం ఆలోచించి, నీట్ ను వాయిదా వేసిందని కామినేని తెలిపారు. ఈ సంవత్సరం ఎంసెట్ మెడికల్ ఫలితాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నందున, చంద్రబాబు స్వయంగా వాటిని విడుదల చేస్తారని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment