తాజా వార్తలు

Friday, 6 May 2016

మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం అర్థరాత్రి గుంటూరు నుంచి విజయవాడకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళగిరి మండలం టోల్‌ప్లాజా వద్ద పల్టీలు కొట్టింది.

ఈ రోడ్డు ప్రమాదంలో మంత్రి కొల్లు రవీంద్రకు స్వల్పగాయాలు అయినట్టు తెలిసింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా గాయాలు కావడంతో వారికి తాడేపల్లి మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment