తాజా వార్తలు

Thursday, 26 May 2016

వారిని ఖాళీ చేయించవద్దు

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం చేపట్టిన భూ సేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు, ఇతర వ్యక్తులను వారి వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని ఉమ్మడి హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక భూ సేకరణపై రైతులు రాతపూర్వక అభ్యంతరాల సమర్పించేందుకు వెసులుబాటు కల్పించింది.ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. అధికారులు ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ ఉత్తర్వులు ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment