తాజా వార్తలు

Wednesday, 18 May 2016

ఉమ్మడి వెంకటేశ్వర్ రావుకు అరెస్ట్ నోటీసులు…

విమానంలో విదేశీ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వివాదంలో చిక్కుకున్న టీడీపీ నేత, విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్ రావు మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని విచారించేందుకే నిర్ణయించుకున్న శంషాబాదు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. విజయవాడకు వెళ్లిన శంషాబాదు పోలీసులు వెంకటేశ్వరరావు కు స్వయంగా అరెస్ట్ నోటీసులు అందజేశారు. వారంలోగా హైదరాబాదు వచ్చి తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ఇంతకుముందు వెంకటేశ్వరరావు ఖండించిన విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment