తాజా వార్తలు

Monday, 23 May 2016

కన్నడ సినిమాపై ఆశలు పెట్టుకున్న భూమిక…

తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్న భూమిక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ.., అందులో ఒకటి, రెండు మాత్రమే ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. దీంతో 2 సంవత్సరాలుగా సినిమాలకు దూరమైన భూమిక తాజాగా ఓ కన్నడ మూవీతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని చూస్తోంది.

ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో ‘ఐ లవ్ యూ అలియా’ అనే కన్నడ సినిమాలో భూమిక నటించింది. ఆమె ప్రధాన పాత్రగా నడిచే ఈ సినిమాలో ఆమె భర్త పాత్రలో రవిచంద్రన్ నటించాడు. ఈ సినిమాలో భర్త ఆదరణకి దూరమై, ఆయన నుంచి విడాకులు కోరుకునే పాత్రలో ఆమె నటించింది. ఈ తరహా పాత్రను ఇంతవరకు చేయలేదని, ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకొస్తుందని భూమిక భావిస్తోంది. మరి ఈ సినిమా భూమికకు ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment