తాజా వార్తలు

Wednesday, 18 May 2016

టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు : బీజేపీ

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు బీజేపీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడుతూ...ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని స్వయంగా సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే కలిసి నడవాలి కానీ టీడీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని వెల్లంపల్లి చెప్పారు.

ఏపీ బీజేపీ కీలక సమావేశం బుధవారం విశాఖలో ప్రారంభమైంది. రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థసింగ్ తో పాటు జిల్లా బీజేపీ నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు.
 
« PREV
NEXT »

No comments

Post a Comment