తాజా వార్తలు

Sunday, 29 May 2016

వెంకయ్యనాయుడుకు మళ్లీ చాన్స్

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి రాజ్యసభకు ఎన్నికకానున్నారు. బీజేపీ తరపున  రాజ్యసభ అభ్యర్థులుగా వెంకయ్యనాయుడు, మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఎంపిక చేశారు. ఆదివారం బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇద్దరు తెలుగువాళ్లకు చాన్స్ దక్కింది.

గతంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్య నాయుడు ఈసారి రాజస్థాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ నాలుగో విడత వెంకయ్యకు అవకాశం ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్ కు ఈసారి కర్ణాటక నుంచి అవకాశం కల్పించింది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అవకాశం దక్కింది. వివరాలిలా ఉన్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment