తాజా వార్తలు

Wednesday, 25 May 2016

29న హైదరాబాద్‌ రానున్న అమిత్‌షా…

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్ వస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో పాటు మండల కార్యవర్గ సభ్యులతోనూ సమావేశమవుతారు. స్థానికంగా ఉన్న సమస్యలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చిస్తారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న సదస్సులో అమిత్‌షా పాల్గొంటారు. రేపటి నుంచి జూన్‌ 15 వరకూ ‘వికాస్‌ పర్వ్‌’ నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్తొంది. తెలంగాణలోనూ జాతీయ, రాష్ట్ర నేతలతో కూడిన బృందాలు పర్యటించనున్నాయి.

త్వరలోనే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్నారు లక్ష్మణ్.
« PREV
NEXT »

No comments

Post a Comment