తాజా వార్తలు

Monday, 2 May 2016

భద్రతను కట్టుదిట్టం చేస్తున్న టీటీడీ…

తిరుమల కొండ నిఘా నీడలోకి వెళ్లనుంది. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండొచ్చన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతో కొండపై బందోబస్తును కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇందులో భాగంగా ఇనుప కంచె నిర్మాణం చేపట్టారు. 2014లో మొదటి దశ గా 5కిలోమీటర్ల మేర ఇనుప కంచెను నిర్మించిన టీటీడీ ఇటీవలే రెండో దశ ఇనుప కంచె పనుల నిర్మాణంకు ఆమోదముద్ర వేసింది. రెండో దశలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర అంటే పాచికాల్వ గంగమ్మగుడి మీదుగా గోగర్భం డ్యాం ఎగువన ఉండే రోడ్డుమార్గం వరకు కంచె నిర్మించనున్నారు.
ఈ ఇనుప కంచెలను నిర్మించడం వల్ల చెక్‌ పోస్టు నుంచి తప్ప లోపలికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్రూర మృగాల బారి నుంచి భక్తులకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయచ్చు. కంచెకు సీసీ కెమెరాలు అమర్చితే అన్ని విధాలుగా భద్రతను పర్యవేక్షించే వ్యవస్థ పెరుగుతుంది. దీంతో తిరుపతి కొండ సేఫ్టీగా మారుతుందని టీటీడీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment