తాజా వార్తలు

Monday, 2 May 2016

వాళ్లను చంపేస్తాం… బ్రిటన్ ఆర్మీలో మా వాళ్లు ఉన్నారు…

తీవ్రవాద సంస్థ ఐసిస్ నేరుగా అమెరికాకే సవాల్‌ విసిరింది. 70మంది అమెరికా సైనిక అధికారులను చంపేస్తామని ప్రకటించింది. తమపై పోరాడిన, డ్రోన్‌ దాడులు చేసిన అమెరికన్ సైనికుల హిట్‌లిస్ట్‌ను విడుదల చేసింది. సిరియా, ఇరాక్‌ల్లో అమెరికా సైన్యం నిర్వహించిన వరుస దాడులతో ఐసిస్‌ తీవ్రంగా నష్టపోయింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఐసిస్ ప్రకటించింది.
అమెరికా సైన్యం ట్విట్టర్‌ ఎకౌంట్లలోకి ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రసంస్థకు చెందిన హ్యాకర్లు చొరబడి కీలక సమాచారం రాబట్టారు. దాని ఆధారంగా మహిళలు సహా 70మంది సైనికులను అంతం చేయాలని సహచరులకు పిలుపునిచ్చింది ఐసిస్. తలనరకడం, కొట్టిచంపడం, కాల్చిచంపడం లేదా బాంబుదాడులు ఏ రూపంలో అయినా వారిని చంపేస్తామని హెచ్చరించారు.
మరోవైపు బ్రిటన్‌ రక్షణశాఖలో తమ మద్దతుదారులున్నారని మరో బాంబ్‌ పేల్చింది ఐసిస్‌. రహస్య ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని త్వరలో బహిర్గతం చేస్తామని బ్రిటన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో డ్రోన్‌ ఆపరేటర్ల సమాచారం కూడా కనుగొంటామని సవాల్‌ విసిరారు. ఐసిస్‌ హ్యాకింగ్‌ విభాగాన్ని బ్రిటన్‌కు చెందిన జునైద్‌ హుస్సేన్‌ చూసేవాడు. అయితే అతను అమెరికా డ్రోన్‌ దాడిలో హతమయ్యాడు. ఐసిస్‌ వార్నింగ్స్‌తో అమెరికా సైన్యం కూడా అప్రమత్తమైంది. లిస్ట్‌లో ఉన్న సైనికుల్ని అప్రమత్తంగా ఉండాలని సమాచారం పంపింది.
« PREV
NEXT »

No comments

Post a Comment