తాజా వార్తలు

Monday, 2 May 2016

రామ్ గోపాల్ వర్మ ‘రాయ్’ ఫస్ట్ లుక్…

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాయ్’. గ్యాంగ్ స్టర్ ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మే 1న విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముత్తప్పరాయ్, రామ్ గోపాల్ వర్మ, వివేక్ ఒబెరాయ్, సి.ఆర్.మనోహర్, దాసరి కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ముత్తప్పరాయ్ యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను వేవ్ ఫిలింస్ అధినేత రాజు చద్దా, ఈరోజ్ ఇంటర్రేషనల్ సునీల్ లుల్లా కైవసం చేసుకున్నారు. అలాగే తమిళ హక్కులను సౌతిండియా ఫిలించాంబర్ అధ్యక్షుడు గంగరాజు ఫ్యాన్సీ చేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. దాసరి కిరణ్ కుమార్ సమర్పణలో సి.ఆర్. మనోహర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment