తాజా వార్తలు

Friday, 6 May 2016

‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ ఉద్రిక్తత, అగ్రనేతల అరెస్ట్‌…

కేంద్రం వైఖరికి నిరసనగా.. ఢిల్లీలో సేవ్ డెమోక్రసీ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, పవర్‌ను అడ్డుపెట్టుకుని ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారును కూలదోసిందని హస్తం నేతలు ఆరోపించారు.
సేవ్‌ డెమోక్రసీ పేరుతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేసిన అనంతరం పార్లమెంటుకు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఢిల్లీ పోలీసులు, ఎస్పీజీ సెక్యూరిటీ అధికారులు కాంగ్రెస్‌ పార్టీ నేతలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. దాంతో బారికేడ్లు తొలగించి ర్యాలీ చేసేందుకు ప్రయత్నించడంతో నిబంధనలు ధిక్కరించారని పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సహా పలువురు పార్టీ నేతలను అరెస్ట్‌ చేసి పార్లమెంటు స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు… కాసేపటికే వారిని విడిచిపెట్టారు. దాంతో పరిస్థితి సద్ధుమణిగింది.
« PREV
NEXT »

No comments

Post a Comment