తాజా వార్తలు

Monday, 2 May 2016

తెలంగాణలో పోరుబాట పట్టిన ప్రైవేట్ ఆసుపత్రులు…

తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఆసుపత్రుల జేఏసీ. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.
నిజానికి ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సి వస్తోన్న బిల్లుల మొత్తం భారీగా ఉంది. గతేడాది నుంచి ఆరోగ్యశ్రీ కింద 87 వేల సర్జరీలు జరిగాయి. ఇందుకు 260 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు చెల్లించాల్సి ఉంది. నిధులు రాకపోవడంతో ఆస్పత్రులకు ఆర్థిక భారం పెరిగిపోయింది. ఇక ఈ విషయం పై సర్కార్ పునరాలోచించాలని ఇప్పటికే ప్రభుత్వ డాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలను మెరుగుపరిచి, అక్కడే వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు కూడా మారుతుందని సూచిస్తున్నారు. అయితే పేదరోగుల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో బకాయిలను చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రకటించింది. రోగులను ఇబ్బంది పెట్టకుండా సేవలు కొనసాగించాలని ట్రస్ట్‌ సీఈవో జేఏసీ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు మంత్రి లక్ష్మారెడ్డిని కలువనున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల జేఏసీ.
« PREV
NEXT »

No comments

Post a Comment