తాజా వార్తలు

Friday, 20 May 2016

'చంద్రబాబును చూస్తే ఎబ్బెట్టుగా ఉంది'

తెలంగాణ ప్రాజెక్టులతో కృష్ణా, గోదావరి బేసిన్ లు ఏడారిగా మారుతాయని, రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మాత్రం సోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేకుంటే ఎలా అన్నారు. అధికారంలో ఉన్నవారు పట్టించుకోకుంటే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. కేంద్రంపై కొట్లాడి హక్కులు సాధించుకురావాల్సిన బాధ్యత అధికార ప్రభుత్వానికి ఉందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తామేం చేస్తామని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటని బొత్స అన్నారు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏడారిగా మారుతుంటే కనిపించడం లేదని ప్రశ్నించారు. కొన్ని పత్రికలు చంద్రబాబు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని రాస్తున్నాయని.. ఆ పత్రికలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కాదా అని ప్రశ్నించారు. ప్రజలకోసం ప్రత్యేక హోదా తీసుకురావాలని ప్రతిపక్షంగా తాము కోరుతుంటే ప్రత్యేక హోదా రానే రాదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం ఎంతమేరకు సమంజసం అని అన్నారు.

ఎంతసేపు తమకు ఎలాంటి లాభం చూకూరుతుందా అనే ఆలోచించడం తప్ప మరొకటి చంద్రబాబు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం తరుపున ఏం చేసినా తనకే లబ్ధిచేకూరేలా.. హెరిటేజ్ పెరుగు.. హెరిటేజ్ నెయ్యి.. చంద్రన్న పథకాలు.. ఇలా చూస్తూ వెళుతుంటే ఏవగింపు, ఎబ్బేట్టు కలుగుతుందని.. ఇలాంటి పాలన ఎవరైనా చేస్తారా అని నిలదీశారు. చంద్రబాబు వెంటనే ప్రధాని నరేంద్రమోదీతో ఏం మాట్లాడారో బయటకు చెప్పాలని, నీటి సమస్యపై ఎలాంటి కార్యచరణ వెలువరిస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.

« PREV
NEXT »

No comments

Post a Comment