తాజా వార్తలు

Saturday, 7 May 2016

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా శర్వానంద్ మూవీ…

విభిన్న కథలతో వరుస సక్సెస్ లు కొడుతున్న హీరో శర్వానంద్‌ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేశాడు. బడా చిత్రాల నిర్మాత అయిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో శర్వానంద్ నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. డార్లింగ్ చిత్రానికి కరుణాకరన్ వద్ద అసోషియేటివ్ గా వర్క్ చేసిన చంద్రమోహన్ చింతాడ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వానంద్ జోడీగా లావణ్య త్రిపాఠి నటించనుంది.
ఈ చిత్రం గురించి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ – ”చంద్రమోహన్ చెప్పిన కథ నచ్చే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. అలాగే జూన్‌ 1 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ రెగ్యులర్ గా జరగనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు రతన్ మ్యూజిక్ ను అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment