తాజా వార్తలు

Saturday, 21 May 2016

కొద్దిపాటి మార్పులతోనే క్యాన్సర్ మరణాలు సగం తగ్గుతాయి!

కేవలం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా క్యాన్సర్ వల్ల కలిగే మరణాలలో సగానికి పైగా నివారించవచ్చని పేర్కొంటున్నారు హార్వర్డ్‌కు చెందిన పరిశోధకులు. ఇది నిశ్చయంగా మేలు చేస్తుందన్న విషయం గతంలోనే తెలిసినా తాజా అధ్యయనాలలో ఈ అంశం మరోమారు సాధికారికంగా నిరూపితమైంది. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అన్నది అన్ని రకాల క్యాన్సర్ మరణాలనే గాక... ఊపిరితిత్తుల కాన్సర్లను 80 శాతం నివారిస్తుందని తేలింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నిపుణులు దాదాపు 1,36,000 మంది మెడికల్ రిపోర్టులను పరిశీలించి, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల దాదాపు 50 శాతం మరణాలు నివారితమయ్యాయని తేల్చారు. అంతేకాదు... పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల కలిగే మరణాలు 21 శాతం తగ్గితే, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మృతులు 12 శాతం తగ్గాయని ఈ అధ్యయనంలో తేలింది.

దీన్నిబట్టి తాజా పండ్లతో కూడిన పోషకాహారం, వారంలో రోజుకు అరగంట చొప్పున కనీసం రెండున్నర గంటల వ్యాయామం, పొగతాగడం పూర్తిగా మానేయడం వంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు... క్యాన్సర్ సంబంధిత మరణాలు సగానికి సగం తగ్గుతాయని తేల్చారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు.
« PREV
NEXT »

No comments

Post a Comment