తాజా వార్తలు

Monday, 2 May 2016

త్యాగిని వదలని సీబీఐ…

అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగిని ఇవాళ మరోసారి ప్రశ్నించనుంది సీబీఐ. 3 వేల 600 కోట్ల కుంభకోణంలో ఒక మధ్యవర్తితో త్యాగికి సంబంధాలు ఉన్నాయని అతనిపై అభియోగం ఉంది. సోమవారం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ పది గంటల పాటు త్యాగిని ప్రశ్నించింది సీబీఐ. ఆయన నుంచి పలు వివరాలు రాబట్టింది. ఈ కేసులో గతంలో కూడా త్యాగిని ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అయితే, ఇటలీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో మరోసారి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు త్యాగితో పాటు ఆయన ఇద్దరు సోదరులను కూడా ప్రశ్నించనున్నారు అధికారులు. విచారణ తర్వాత త్యాగిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment