తాజా వార్తలు

Friday, 27 May 2016

ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందే…

ఆర్థిక క‌ష్టాల్లో… విభ‌జ‌న న‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుని తీరాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు… మ‌హానాడు వేదిక‌గా మాట్లాడిన ఆయన కేంద్రం నుంచి సాయం అందుతున్నా అది కొంత మేర‌కే ఉంద‌ని.. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను పూర్తిగా అమ‌లు చెయ్యాల‌ని కోరారు.
అంత ఇచ్చాం… ఇంత ఇచ్చాం… అని బీజేపీ ప్రకటనలతో హోరెత్తిస్తుండటంతో సీఎం ఏం చెపుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు… అయితే చంద్రబాబు సున్నిత‌మైన ఆ వ్యవహారంపై ఎప్పటిలానే హామీల అమలుకు ప‌ట్టుప‌డ‌తాం అని మాత్రం ప్రకటించారు.
తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం, ఆదాయం పెరగక క‌ష్టాల్లో ఉన్న ఏపీని గ‌ట్టెక్కించ‌డం కోసం కేంద్రంతో క‌లిసి సాగుతామని అన్యాపదేశంగా స్పష్టం చేశారు. ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేక దృష్టితో చూడాలన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment