తాజా వార్తలు

Saturday, 21 May 2016

ఉద్యోగులు త్యాగాలకు సిద్ధం కావాలి…

ఉద్యోగులు రాజధానికి తరలి రావాల్సిందేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొన్ని విషయాల్లో త్యాగాలు చేయక తప్పదన్నారు. మూడో ఏడాది కూడా విజయవాడకు రాననడం సరికాదన్నారు సీఎం. అందుకోసమే ఉద్యోగులకు ఐదురోజుల పనిదినాలు చేశామన్నారు చంద్రబాబు.
ప్రత్యేకహోదాపై రాజీ పడేది లేదన్నారు చంద్రబాబు. మేం ఎప్పటి నుంచో కేంద్రానికి లేఖలు రాస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ఆ రోజు చేసిన నిర్వాకం వల్లే ఈ రోజు ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు చంద్రబాబు. విభజన సమస్యలు చాలా పరిష్కారం కావాల్సిఉందన్నారు.
ఏపీకి ఏ అవతర దినోత్సం పెట్టాలని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. కర్నూలుకు వచ్చింది పెట్టాలా… హైదరాబాద్‌కు వచ్చింది పెట్టాలా… అమరావతికి వచ్చింది పెట్టాలా అన్నారు. రాష్ట్ర విభజనతో ఇబ్బందులు వచ్చాయి… కట్టుబట్టలతో వచ్చాం… కష్టపడుతూ ఉత్సవాలు చేసుకోలేం కదా అన్నారు. విభజనతో కష్టపెట్టారు కాబట్టి ఆ కసి, కోసం తగ్గడానికి వీల్లేదు… అందుకే నవనిర్మాణ దీక్ష పెట్టామన్నారు చంద్రబాబు.
« PREV
NEXT »

No comments

Post a Comment