తాజా వార్తలు

Friday, 6 May 2016

పాత్ర కోసం చరణ్ కసరత్తులు…

ప్రస్తుతం ‘తని ఒరువన్’ రీమేక్ లో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్న చరణ్ ఆ పాత్ర కోసం తన ఫిజిక్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఒకవైపు రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ.., మరోవైపు హార్స్ రైడింగ్ లోనూ నిపుణుల పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు.
ఒక షెడ్యూల్ ను ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి చిత్రీకరణ కోసం త్వరలో కశ్మీర్ వెళ్లనుంది. అయితే చిరంజీవి 150వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం వల్ల ఈ మూవీ షూటింగ్ కాస్త లేట్ గా జరుగుతోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment