తాజా వార్తలు

Thursday, 5 May 2016

వైరల్ అవుతున్న బన్నీ “చెప్పను బ్రదర్” …

డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో దుమ్మురేపింది అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’. మొదటి సారిగా తన నాన్న బ్యానర్ లో హిట్ కొట్టినందుకు హ్యాపీగా ఉన్న బన్నీ, బుధవారం విజయవాడలో సరైనోడు సక్సెస్ మీట్ పెట్టాడు. ఆ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా పవన్ నామాన్ని జపించారు కింద ఉన్న పవన్ ఫ్యాన్స్. దీంతో చిర్రెత్తుకొచ్చిన బన్నీ నవ్వుతూనే ‘చెప్పను బ్రదర్’ అని అనేశాడు. అల్లు హీరో చెప్పిన ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ మాటతో పవన్ ఫ్యాన్స్ కాస్త బాధపడ్డా.., సోషల్ మీడియాలో మాత్రం బన్నీ చెప్పిన ‘చెప్పను బ్రదర్’ అన్నది ట్రెండింగ్ అయిపోయింది. ఇక ఇందులో స్పూఫ్ లు మీద స్పూఫ్ లు పెడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు టాప్ 10 ట్రెండింగ్ లో ‘చెప్పను బ్రదర్’ స్థానాన్ని కూడా సంపాదించుకుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment