తాజా వార్తలు

Sunday, 29 May 2016

చిరు ప్రశంసలు అందుకున్న సంపూ…

ఇప్పటికే యూట్యూబ్ లో సంచలన రికార్డులను సొంతం చేసుకున్న కొబ్బరిమట్ట టీజ‌ర్ కు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంశ‌లు ల‌భించాయి. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందించిన స్టీవెన్ శంక‌ర్ మెగా అభిమాని కావడంతో హీరో సంపూర్ణేష్ బాబు త‌న చిత్రం కొబ్బరిమ‌ట్ట టీజ‌ర్ ను చిరంజీవికి చూపించారు. ఆ టీజ‌ర్ ని చూసిన చిరంజీవిగారు “చాలా బాగుందని, కామెడిగా వుంటూ మంచి మెసేజ్ వుంద‌ని , డైలాగ్స్ రాసిన స్టీవెన్ శంక‌ర్ చాలా డెప్ట్ తో ఈ డైలాగ్స్ రాసాడ‌ని అన్నారు. అలాగే సంపూ మాడ్యులేష‌న్ చాలా మెచ్యురిటిగా వుంద‌ని ప్రశంసించి, ఈ చిత్రానికి త‌న బెస్ట్ విషెస్” కూడా అందించారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత సాయి రాజేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.., “ఈ రోజు త‌ప్పకుండా మా కొబ్బరిమ‌ట్ట యూనిట్ అంతా పండ‌గ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి పెరిగాను. ఆయ‌న్ని చూసి చిత్ర రంగం లోకి అడుగుపెట్టాను. కేవ‌లం నేనొక్కడినే కాదు నా కొబ్బరిమ‌ట్ట చిత్ర యూనిట్ అంద‌రం అన్నయ్య వీరాభిమానుల‌మే. మా కొబ్బరిమ‌ట్ట టీజ‌ర్ ని సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌ల కావ‌టం విశేషం అయితే ఈరోజు ఇలా మెగాస్టార్ ప్రశంశ‌లు అందుకోవ‌టం మా జ‌న్మ ద‌న్యమైంద‌ని అనుకుంటున్నాం. మా చిత్రం విజ‌యం సాధించాల‌ని మ‌మ్మల్ని ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా యూనిట్ త‌రుపున ధ‌న్యవాదాలు తెలుపుతున్నాను” అని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment