తాజా వార్తలు

Wednesday, 25 May 2016

రెడీ అవుతున్న ‘చుట్టాలబ్బాయి’…

ఆది హీరోగా వీరభద్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చుట్టాలబ్బాయి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి మాట్లాడుతూ.., ”ఇటీవల చిత్రీకరించిన క్లైమాక్స్‌తో షూటింగ్‌ పూర్తయిందని. ప్రస్తుతం డబ్బింగ్‌ వర్క్‌ జరుగుతోందని అన్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ప్రస్తుతం యు.ఎస్‌.లో ఉన్నారని, ఆయన రాగానే ఆడియో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నామని” అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ.., ”ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, ఆదికి మరో మంచి సినిమా అవుతుందని తెలిపారు. ఇక ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చారని అన్నారు. ఈ సినమాలో ఆది సరసన నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటించగా.., బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment