తాజా వార్తలు

Saturday, 21 May 2016

వాణిజ్యపన్నుల శాఖలో ఖాళీలన్నీ భర్తీచేస్తాం…

తెలంగాణ సీఎం కేసీఆర్ వాణిజ్య పన్నుల శాఖపై సమీక్ష నిర్వహించారు. మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వాణిజ్య పన్నుల శాఖ వ్యవస్థను, వసూళ్లను పటిష్ట పర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్‌.
వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని, వెంటనే ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలన్నారు. 100 శాతం పన్నులు వసూలయ్యే విధానం అమలు చేయాలని ఆదేశించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
సకాలంలో పన్నులు చెల్లించే వారిని ప్రోత్సహించాలని సూచించారు సీఎం కేసీఆర్‌. కోర్టు వివాదాల్లో ఉన్న బకాయి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు చెప్పారు. పదవీ విరమణ చేసే అధికారుల సేవలను, అనుభవాలను ఉపయోగించుకోవాలన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment