తాజా వార్తలు

Friday, 6 May 2016

హోదా పోరుపై కాంగ్రెస్‌ వ్యూహం…

ప్రత్యేకహోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో సమావేశమైన జాతీయ, ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదాపై చర్చించారు. ఈ నెల 13న రాజ్యసభలో జరిగే ప్రైవేటు మెంబర్స్ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ సభ్యులంతా పాల్గొనేలా వ్యూహం రచిస్తున్నారు.
కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, హరిభాయ్ చౌదరి ప్రకటనలపై సమావేశంలో చర్చించారు. ప్రైవేటు మెంబర్‌ బిల్లుకు మద్దతివ్వాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు లేఖ రాయాలని కేవీపీ నిర్ణయించారు. బిల్లుకు మద్దతు కోరుతూ ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ఆయన లేఖరాశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment