తాజా వార్తలు

Friday, 27 May 2016

తెలంగాణలో దొరల ప్రభుత్వం: సీపీఐ

తెలంగాణలో దొరల ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం దామరచర్లలో పార్టీ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఆ హామీ విస్మరించడంతోపాటు ఎక్కువ మంది అగ్రవర్ణాల వారికే మంత్రి పదవులను కట్టబెట్టారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఎన్నికల ప్రణాళికలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment