తాజా వార్తలు

Saturday, 7 May 2016

చంద్రబాబు తీరుతోనే ‘హోదా’ పట్ల నిర్లక్ష్యం


సీఎం చంద్రబాబు తీరుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోవాలని చంద్రబాబు, కేసీఆర్‌లకు హితవు పలికారు. కృష్ణా నీటి పంపిణీపై బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల ఆధారంగా ఇరు రాష్ట్రాలలోని పాలమూరు ప్రాంతం, రాయలసీమ,ప్రకాశం జిల్లా నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.చర్చల ద్వారా నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంలను రామకృష్ణ కోరారు.


« PREV
NEXT »

No comments

Post a Comment