తాజా వార్తలు

Sunday, 29 May 2016

మగాడంటే.. మాట మీద నిలబడాలి

‘మగాడంటే.. మాట మీద నిలబడాలె. నపుంసకుడిలా మాటలు మారుస్తూ కాలం గడిపేయడం సరికాదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌నుద్దేశించి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టేక్మాల్ దర్గాలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు.

మోసగాని చేతిలో తెలంగాణను పెట్టారని, టీఆర్‌ఎస్ పాలనలో అధికారులు బానిస బతుకులు బతుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సుమారు 1,500 మంది రైతులు మరణించినా, ఏ ఒక్కరోజు కూడా వారిని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment