తాజా వార్తలు

Thursday, 5 May 2016

దేశంలో అల్లకల్లోలానికి దావూద్ ప్లాన్

దేశంలో అరాచకం సృష్టించేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుట్రలు చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు పెంచడంతోపాటు ఆయా మతాలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేశాడని, వారిలో ముఖ్యంగా ఆరెస్సెస్ నాయకులు, చర్చిలు, చర్చిల ఫాథర్లు లక్ష్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీకి చెందిన పదిమందిపై శనివారం చార్జిషీట్ దాఖలు చేయనుంది. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో శాంతి అనేదే లేకుండా చేయాలని వారు కుట్ర పన్నినట్లు ఆ చార్జీషీట్లో పేర్కొంది.

గత ఏడాది నవంబర్ 2న దావూద్ కంపెనీకి చెందిన షార్ప్ షూటర్స్ ఆరెస్సెస్ కు చెందిన శిరిష్ బెంగాలీ, ప్రగ్నీష్ మిస్త్రీలను గుజరాత్ లోని భారుచ్ లో చంపేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని అరెస్టు చేయగా 1993 ముంబయిలో వరుస బాంబు పేలుళ్లకు కారకుడైన యాకుబ్ మెమన్ ను ఉరితీశారన్న కక్షతో వారిని చంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ షురూ చేసిన ఎన్ఐఏ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ లీడర్ల హత్య మాత్రమే కాకుండా మొత్తం దేశంలోనే అల్లకల్లోలం సృష్టించేందుకు భారీ పథకం పన్నినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment