తాజా వార్తలు

Saturday, 14 May 2016

డౌట్లు ఏమీ పెట్టుకోకండి… చిరు సినిమా మొదలైంది…

మెగా స్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు ఏప్రిల్ 29న పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాడు. అయినా ఇన్ని రోజులుగా పట్టాలెక్కకపోవడంతో సినిమా విషయంలో రోజుకో రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుందని, కథ మళ్లీ మారిందని ఇలా రోజుకో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ డౌట్లు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి సినిమా స్టార్ట్ అయిపోయింది.
అవునండి చిరంజీవి షూటింగ్ లో పాల్గొనకముందే ఈ సినిమాకు మ్యూజిక్ ను స్టార్ట్ చేసేశాడు రాక్ స్టార్ డీఎస్పీ. దీనికి సంబంధించి చిరంజీవితో తీసుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.., “చిరు 150వ సినిమా మ్యూజిక్ కు ఫస్ట్ డే డిస్కషన్ చేశాం. వెల్ కమ్ బ్యాక్ సర్” అంటూ తన అభిమానాన్ని చూపించాడు దేవీ శ్రీ ప్రసాద్. బేసిక్ గా చిరంజీవికి పెద్ద అభిమాని అయిన దేవీ శ్రీ ప్రసాద్ అతడి ‘శంకర్ దాదా ఎమ్ బీ బీ ఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’, ‘అందరివాడు’ సినిమాలకు సంగీతాన్ని అందించాడు. మరి చిరుకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సినిమా కోసం ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో ఎదురుచూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment