తాజా వార్తలు

Wednesday, 18 May 2016

ఇక నుండి టీఎస్పీఎస్సీ ద్వారానే టీచర్లు…

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియామ‌కాల కోసం నిర్వహించే డీఎస్సీ ప్రవేశ ప‌రీక్ష ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఉండ‌దు. టీఎస్‌పీఎస్సీ ద్వారానే ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేప‌ట్టనుంది. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీని ర‌ద్దు చేస్తున్నట్లు, తెలంగాణ‌లోని మోడ‌ల్ స్కూళ్లలోనూ టీఎస్‌పీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయ‌నున్నట్లు ప్రకటించింది. డీఎస్సీని తొల‌గించి టీఎస్‌పీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని కొన్ని రోజులుగా క‌స‌రత్తు చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం చివ‌ర‌కు ఈరోజు తుది నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment