తాజా వార్తలు

Saturday, 7 May 2016

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు ఉగ్రవాదుల హతం…

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని పంజ్ గమ్ గ్రామంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అక్కడ గస్తీ కాస్తున్న సైనికులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సైనిక దళం ఆ కాల్పులను తిప్పిగొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది.
కాల్పుల అనంతరం నిర్వహించిన సోదాల్లో ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు మరికొంతమంది ముష్కరులు కూడా రంగంలోకి దిగి ఉంటారని అనుమానిస్తున్న సైనిక బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మర సోదాలను జరుపుతున్నాయి. చనిపోయిన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా గుర్తించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment