తాజా వార్తలు

Wednesday, 18 May 2016

కేసీఆర్ ఫైర్కా : గితాలపై కాలేజీలు నడుపుతారా

తెలంగాణలో గందరగోళంగా ఉన్న విద్యావ్యవస్థను చక్కదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకే విద్యావ్యవస్థను పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి సీఎం కేసీఆర్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించిన కాలేజీ యాజమాన్యాలను సరిదిద్దుకునే అవకాశం, సమయం ఇస్తామని చెప్పారు.

పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చిన కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చాయని, కనీస సౌకర్యాలు కూడా విస్మరించాయని చెప్పారు. నాసిరకం కాలేజీలు స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్ చెప్పారు. కాగితాల మీద కాలేజీలు నడవడం ఎంతటి దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాల కకృతి చర్యలకు ఆన్ లైన్ అడ్మిషన్ విధానం అడ్డుకట్ట వేస్తుందని ఆశించారు. ఫేక్ కాలేజీ యాజమాన్యాలను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment