తాజా వార్తలు

Friday, 13 May 2016

నాచారంలో భారీ అగ్నిప్రమాదం… కిలోమీటర్ల మేర వ్యాపిస్తున్న పొగ…

హైదరాబాద్ లోని నాచారం పారిశ్రామికవాడలో ఒక రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో దట్టమైన పొగలు దాదాపు 200 అడుగులకు పైగా ఎగిసి కిలోమీటర్ వరకు పొగలు కమ్మేయగా, సమీపంలోని ఇళ్ల వైపు మంటలు వెళుతున్నాయి. సంఘటనా స్థలికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు ఒకవైపు మంటలను ఆపేందుకు శ్రమిస్తుండగా, మరోవైపు మంటలు విస్తరిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు హుటాహుటిన తరలిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment