తాజా వార్తలు

Saturday, 21 May 2016

వైట్ హౌస్ ముందు కాల్పుల కలకలం…

అమెరికాలోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు జరిగాయి. అమెరికా దేశాధ్యక్షుడి అధికారిక భవనానికి అతి సమీపంలో
ఆగంతకుడు కాల్పులకు తెగపడ్డాడు. వైట్‌హౌస్‌లోకి ఆయుధాలతో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వ్యక్తపై భద్రతా సిబ్బంది
కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. వైట్‌హౌస్‌ ఔటర్‌ పెరిమీటర్‌ చెక్‌పాయింట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రెసిడెంట్ ప్యాలెస్ వద్దే ఈ ఘటన జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి పడింది…
వైట్‌హౌస్‌కు కొంత దూరంలో అగంతకుడు తన వాహనాన్ని నిలిపి ఉంచాడని, అందులో కొన్ని ఆయుధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్‌హౌస్‌లో లేరని అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడు జోయ్‌ బైడ్‌ మాత్రం తన కార్యాలయంలో ఉండటంతో అక్కడ అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment