తాజా వార్తలు

Thursday, 19 May 2016

ఇది ఉగ్రవాదుల పనే అనుకుంటున్నాం…

ఈ ఉదయం ఈజిప్టులో అదృశ్యమైన విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేసినట్లు అనుమానిస్తున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి అందులోని ప్రయాణికుల కుటుంబాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు. కానీ అనుమానాలను అలాగే వదిలేయమని, ఖచ్చితంగా విచారణ చేయిస్తామని తెలిపారు.
ఈ ఉదయం పారిస్ నుంచి కైరోకు బయలుదేరిన ఎంఎస్ 804 విమానానికి, గ్రీక్ ద్వీపం దగ్గరకు రాగానే కనిపించకుండా పోయింది. దీంతో విమానం కోసం మూడు దేశాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఎయిర్ పోర్టులో తనిఖీలు సరిగ్గా జరగలేదని తేలడంతో ప్యారిస్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న పలువురిని తొలగించినట్టు సమాచారం.
« PREV
NEXT »

No comments

Post a Comment