తాజా వార్తలు

Saturday, 14 May 2016

ప్రశంసలు అందుకుంటున్న ‘జెంటిల్ మన్’ టీజర్…

నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం జెంటిల్ మన్. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా తొలి టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.., “గురువారం విడుద‌లైన జంటిల్ మన్ టీజ‌ర్ కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోందని, ప్రస్తుతం ఈ సినిమాకు రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయని అన్నారు. మ‌ణిశ‌ర్మ స‌మ‌కూర్చిన సంగీతం ఈ మూవీకి హైలైట్ అవుతుందని, ఈ నెల‌ 22న పాట‌ల‌ను విడుద‌ల చేయనున్నట్లు తెలిపారు. అలాగే జూన్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయనున్నట్లు” వెల్లడించారు.
ఇందులో నాని సరసన సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, ‘సత్యం’ రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు మిగిలిన ప్రధాన పాత్రలలో నటించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment