తాజా వార్తలు

Thursday, 5 May 2016

సవతి తల్లి అమ్మేసింది.. ఎమ్మెల్యే కన్నేశాడు!

మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అటనాసియో మాన్‌సెరాట్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మార్చిలో 16ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణల మేరకు గోవా పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన మాన్‌సెరాట్ గతంలోనూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన సవతి తల్లి రూ. 50 లక్షలకు తనను ఎమ్మెల్యేకు అమ్మేసిందని 16 ఏళ్ల బాధితురాలు గురువారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆరోపించింది. ఎమ్మెల్యే తనను నిర్బంధించి మత్తు మందు ఇచ్చి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. బాధితురాలికి గోవా మెడికల్ కాలేజీలో  నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారం  జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం, అక్రమ నిర్బంధం, విషప్రయోగం, మనుషుల అక్రమ రవాణా నేరారోపణలతో పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు.

బాలిక సవతి తల్లిపైనా మనుషుల అక్రమ రవాణా తదితర చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ‘నేనేతప్పూ చేయలేదు. నన్ను ఇరికించటం కోసమే చేశారు. ఆమె నా షోరూమ్ హాల్‌మార్క్‌లో పనిచేస్తుండేది. కానీ ఆమె దొంగతనం చేస్తూ పట్టుబడ్డాక పనిలోనుంచి తొలగించాను. ఇదంతా రాజకీయం. నేను దాక్కోవట్లేదు. లొంగిపోవటానికి వచ్చా’’ అని మాన్ సెరాట్ పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment