తాజా వార్తలు

Thursday, 5 May 2016

పైపైకి వెళ్తున్న పసిడి, వెండి ధరలు…

బంగారం మళ్లీ పైపైకి లేస్తోంది. స్వల్పంగా అప్పుడప్పుడూ తగ్గుతున్నా ఇప్పుడు తులం 30వేలకు పైనే పలుకుతోంది. 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర ముప్పైవేల వంద రూపాయలకు చేరింది. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ ముందుండడం కొనుగోలుకు వినియోగదారులు క్యూ కట్టడం కూడా డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణం అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
మరోవైపు పసిడితోపాటు వెండి ధరకూడా ప్రియమవుతోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి 40 వేలు దాటింది. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, దాంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను అతి విలువైన లోహాల వైపు మళ్లిస్తున్నారని అందువల్లే బంగారం,వెండి ధరలు పుంజుకుంటున్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment